ఐపీఎల్ ఎలిమినేటర్... రాజస్థాన్ పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్... గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి!
- ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్
- మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్
- ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఆడిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌దే గెలుపు
- గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమణ
- హైదరాబాద్ తుది జట్టులోకి హింగే.. రాజస్థాన్ టీమ్‌లోకి జడేజా
ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత కీలకమైన ఎలిమినేటర్ పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు చేరనుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
టాస్ గెలిచిన అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ మధ్యకాలంలో మేము మంచి క్రికెట్ ఆడాం. మా బౌలర్ల బలానికి అనుగుణంగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి ఛేజింగ్ గ్రౌండ్ కావడంతో ఒత్తిడి గురించి ఆలోచించడం లేదు" అని పేర్కొన్నాడు. తుది జట్టులోకి ప్రఫుల్ హింగే తిరిగి వచ్చాడని తెలిపాడు.
రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేము కూడా టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లం. మా పూర్తి సామర్థ్యంతో ఆడితే విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు" అని వివరించాడు.
ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రయాణం ఒకేలా సాగడం ఆసక్తికరం. రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్లింది. అయితే సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత వారి ఫామ్ దెబ్బతింది. మరోవైపు, తొలి నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓడిపోయిన సన్‌రైజర్స్‌కు అదే రాజస్థాన్‌పై గెలుపు టర్నింగ్ పాయింట్‌గా మారింది. అప్పటి నుంచి ఆరెంజ్ ఆర్మీ అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఆడిన రెండు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఈ కీలక ఎలిమినేటర్‌లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి 3-0తో నిలవాలని హైదరాబాద్ భావిస్తుండగా, సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డుల్లో సన్‌రైజర్స్ 14-9 ఆధిక్యంలో ఉంది. గత ఆరు మ్యాచుల్లో రాజస్థాన్‌పై హైదరాబాద్‌దే పైచేయి కావడం గమనార్హం. 2024 సీజన్ నుంచి రాజస్థాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సన్ రైజర్స్ ను ఓడించలేకపోయింది.
ఈ మ్యాచ్‌లోనూ కీలక ఆటగాళ్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. గతంలో రాజస్థాన్‌పై తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన ప్రఫుల్ హింగే, మరోవైపు తొలి ఓవర్లోనే నాలుగు సిక్సులు బాదిన సూర్యవంశీ మధ్య పోరు కీలకం కానుంది. అదేవిధంగా, ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డొనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్: సలీల్ అరోరా, అనికేత్ వర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్.
రాజస్థాన్ రాయల్స్: శుభమ్ దూబే, సుశాంత్ మిశ్రా, అమన్ రావు పెరాల, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.